తుపాను ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా నిలకడగా ఉన్న చలిగాలులు గత మూడు రోజుల నుంచి గణనీయంగా పెరగాయి. మంగళ, బుధ,గురువారాలతో పోలిస్తే శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
నేడు నిర్మల్ జిల్లాలో 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. గుండంపల్లి క్రాస్ రోడ్స్ , దిల్వార్ పూర్, లోలం మీదుగా సిర్గా పూర్ వరకు యాత్ర సాగనుంది.
నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య బెట్టింగ్ వారి కుటుంబంలో పెనువిషాదాన్ని నింపింది. చెరువులో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదాలని తండ్రీకొడుకులు పందెం కాశారు.
Hyderabad : క్షయ వ్యాధిపై హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యుద్ధం ప్రకటించింది. ఎక్కడైనా క్షయ వ్యాధిగ్రస్తులు కనిపిస్తే సమాచారం అందించాలని నగరవాసులకు పిలుపు నిచ్చింది.
సిరిసిల్లలో మరోసారి ఫ్లెక్సీల కళకం బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల కలకం రేపాయి. సిరిసిల్లలోని పలు కూడళ్లలో బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలుతో ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ఏడ్చే మగవాళ్లను నమ్మవద్దని పురాణాలు చెబుతున్నాయి అని ఫ్లెక్సీలో ఉంది. ఓ వైపు బండి సంజయ్ కళ్లలోంచి నీరు కారడం మరో వైపు అమ్మాయి నవ్వుతుండటం ఫోటో పెట్టారు. ఫ్లెక్సీలో నవ్వే ఆడవాళ్లను…
నేడు రాజ్భవన్కు వైఎస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతన్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆమె పాదయాత్రపై దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. అయితే.. అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన షర్మిల టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ నేడు రాజ్భవన్కు చేరుకోనుంది. వైఎస్ షర్మిల నేటి…