హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్ట్స్ (ఫేజ్-III) కింద రూ.2,410 కోట్లతో 104 లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి దాడితో రైతు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అధికారులకు మొర పెట్టుకోవడంతో పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తమ ఇష్టాన్ని కాదని కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కన్నకూతురు అన్న విషయాన్ని కూడా మరిచి ఆమెకు కోలుకోలేని గాయాన్ని చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరిగింది. ఇక.. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉదయం పొగ మంచు కురుస్తుంది.
తన కోరిక మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదల చేయడానికి కేంద్రం ఒప్పుకుంటే.. టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే వచ్చిందని గప్పాలు కొట్టుకుంటున్నారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు.
రాజ్భవన్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భందా మీడియాతో ముచ్చటించిన గవర్నర్ తమిళిసై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 సర్వీసుల ప్రాథమిక పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 1,019 పరీక్షా కేంద్రాలలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు 150 నిమిషాల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ వేళలను మరింతగా పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 10.15 గంటల వరకే హైదరాబాద్లో మెట్రో సేవలు అందుతుండగా.. ఇకపై రాత్రి 11 గంటలకు పెంచాలని హైదరాబాద్ మెట్రోరైలు నిర్ణయించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చడంతో పాటుగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు.