రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామ యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను జ్యోతి కిడ్నాప్ విషయంపై వివరాలు కేటీఆర్ అడిగారు.
నేడు ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో నేడు ఈడీ విచారణకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయంకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలతో హాజరుకానున్నారు. 2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందించాలని ఈడీ కోరింది. ఆధార్ కార్డు నుండి పాస్ పోర్టు వరకు 10 అంశాల బయోడేటా వివరాలతో విచారణకు…
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సర్క్యులేట్ చేశారని, గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసి మీడియాకు పంపారనే పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావడంతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిలను అదుపులో తీసుకున్నారు.
తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు ఇంధనాలపై అధిక వ్యాట్ వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఖండించారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది.
Mandous Cyclone : మాండూస్ తుఫాను కారణంగా ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజులుగా వానలు కురుస్తున్నాయి. కర్ణాటకలో నిన్నటి వరకు తుఫాన్ ప్రభావం తక్కువగా కనిపించినప్పటికీ..
Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీల నియామకం కల్లోలం సృష్టిస్తున్నాయి. నిన్న ప్రకటించిన ఏఐసీసీ రిలీజ్ చేసిన జాబితాలో తన జూనియర్ల కంటే తక్కువ స్థానం కల్పించారంటూ కొండా సురేఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
CM KCR Delhi Tour : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు.
YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు.