హైదరాబాద్లోని సికింద్రాబాద్ నల్లగుట్ట డెక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదు రోజుల కావస్తున్నా ఇంకా అదృశ్యమైన యువకుల ఆచూకీ లభించక పోవడంతో కలకలం రేపుతుంది. పోలీసులు అగ్నిమాపక శాఖ, డీఆర్ఎఫ్, క్లూస్ టీమ్ సిబ్బంది భవనంలోని అన్ని అంతస్తుల్లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించినా ఫలితం దక్కలేదు.
ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతరకు వేళయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది.
నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా పురపాలక శాఖ మంత్రికి పట్టదని ఆయన విమర్శించారు.
సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో రెండు రోజులు గడుస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. నిన్నటి నుంచి ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథపై వివాదం మరింత వేడెక్కుతోంది. తోటి విద్యార్థులను దూషించి కొట్టిన ఓ వీడియో ఇప్పటికే వైరల్గా మారగా.. ఇప్పుడు మరో వీడియో విడుదల కావడం సంచలనంగా మారింది.
భాగ్యనగరం మొత్తం ఖాళీ అయిపోయింది. రోడ్లన్నీ జనంతో నిర్మానుష్యంగా మారాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంతా స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
TSRTC ZIVA Water Bottles: తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారాన్ని నేడు ప్రారంభించింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు జీవా మంచి నీటి బాటిల్స్ ను నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.
Bhadrachalam Temple: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకం నిర్వహించి.. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి…
కామారెడ్డి రైతుల భూ పోరాటం తెలంగాణ మొత్తాన్ని ఉడికిస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ మంటలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని నిన్ననే నిరసనకు దిగిన రైతులు. ఇవాళ బంద్కు కామారెడ్డి పిలుపునివ్వడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.