Hyderabad: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టోందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మరో పది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. దీంతో ప్రజలంతా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ వేడుకులపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రజలకు, ఈవెంట్ నిర్వహకులకు పలు నిబంధనలు జారి చేశారు. ‘న్యూఇయర్ వేడుకలను రాత్రి 1 గంటల వరకు ముగించాలి. ఈవెంట్ నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. ప్రతీ ఈవెంట్ల…
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఈ కేసుకు సంబధించి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతంలో చంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర రాజకీయాలు వంటి ఇతరత్రా అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం ఢిల్లీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి సాయంత్రానికే హైదరాబాద్ రానున్నారు. ఇక అధిష్టానంతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి…
నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై సోమవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క…
నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య గురైన ఘటన సదా శివనగర్‌లో చోటుచేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులను వరసగా హత్య చేశాడు ఓ సైకో కిల్లర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపన వివరాలు ప్రకారం.. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబంలోని ఆరుగురు వరస హత్యకు గురయ్యారు. 15 రోజుల…
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి తన హామీలను అమలు చేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం అనంతరం మహిళలకు కోసం తెచ్చిన మహాలక్ష్మి పథకంలోని ఫ్రీ బస్ హామీని అమలులోకి తెచ్చింది. దీంతో మహిళా ప్యాసింజర్స్‌తో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా ఫ్రీ బస్ పథకంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మహిళలకు కలిసి వచ్చినా ఆటో డ్రైవర్లను మాత్రం దెబ్బతీస్తోంది.…
నిజామాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. ఆర్కూర్ బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత్‌పై ఆ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్దమయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా26 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశమయ్యారు. అంతేకాదు మంగళశారం వారు జిల్లా కలెక్టర్‌ను కలిసి పండిత్ వినీత్‌పై అవిశ్వాస తీర్మాణం పెట్టెందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వారు తమ వినతి పత్రంలో ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు…
రాష్ట్ర రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వ్యవసాయశాఖ కార్యదర్శి కార్యాలయంలో మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల పనితీరు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల మాట్లాడుతూ.. వ్యయవసాయ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్నారు. సాగురంగంలో…
Ponnam Prabhakar Visits Husnabad: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తన సొంత నియోజకవర్గ హుస్నాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. మంత్రిగా ఛార్జ్ తీసుకున్న అనంతరం తొలిసారి హుస్నాబాద్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. ‘ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్‌కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత నాది. సెంటిమెంట్ కాదు హుస్నాబాద్‌లో డెవలప్మెంట్ మొదలైంది.…