బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాళ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ దమ్ముంటే వినోద్ కుమార్ తో చర్చకి రావాలని బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ కి ఎంపీగా నువ్వేం చేశావో, బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చిద్దామన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు తేలేకపోయావన్నారు కేటీఆర్. ఎంపీగా బండి సంజయ్ అట్టర్ ప్లాప్ అని, ఏనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదన్నారు. గుడి తేలేదు ,బడి తేలేదు.. మరెందుకు సంజయ్ ఎంపీగా ఉండాలన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయమని, అందులో ఆరు ఏడు సీట్లు వచ్చినా ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ఉమ్మడి కరీంనగర్ లో కాంగ్రెస్ వాళ్లు సెంటిమెంట్ తో గెలిచినవాళ్లే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవెచ్చకపోతే విడిచిపెట్టేది లేదని, వందరోజుల తరువాత హామీలు అమలు కాకపోతే కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పుతామన్నారు. సోషల్ మీడియా లో ఏ అంశాన్ని వదిలిపెట్టొద్దని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. ఇదిలా ఉంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నడుం విరిగిందో కేటీఆర్ విరగకొట్టాడో ఆయన ఎంత బాధపడ్డాడో అని అన్నారు. కేటీఆర్ పారచూట్ లీడర్.. ఫెయిల్యూర్ కొడుకు అని ఆయన అన్నారు. హిందుగాళ్ళు బొందుగాళ్లు అన్న కేసీఆర్ నోటి నుంచి తాను హిందువుని అని చెప్పుకునే స్థితి తెచ్చింది బీజేపీ అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ ది మూడో స్థానమేనని, రైల్వే బ్రిడ్జ్ కి 150 కోట్లు కేంద్రం నుంచి తెస్తే నేను లేనిది చూసి శంఖుస్థాపన చేశారన్నారు. కేసీఆర్ టైం వేస్ట్ చేయడు నిరంతరం కుట్ర రాజకీయాలు ఆలోచనలతో ఉంటాడని, కేసీఆర్, కేటీఆర్, వినోద్ లు రామాలయం ప్రతిష్టాపనాలో అక్షింతల కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదన్నారు. దేవుణ్ణి నమ్మే కరీంనగర్ ప్రజలు నాస్తుకుడైన వినోద్ కి ఓటేయరని, తన తండ్రి ఇంకా సీఎం అనుకుంటున్నాడు కేటీఆర్ అని, బండి సంజయ్ పై పోటీ చేసేందుకు కరీంనగర్ బీఆర్ఎస్ లో పోటీ చేసే వాళ్ళు లేక పక్క జిల్లాల నుంచి అభ్యర్థిని అరువు తెచ్చుకున్నాడన్నారు. కరీంనగర్ కి ఏం చేసానో చెప్తా కేసీఆర్ ని రమ్మనండి.. వేములవాడ కి గాని కొండగట్టుకు గాని వస్తారా? అని ఆయన ప్రశ్నించారు. వారు చెప్తున్న మేధావి వినోద్ కుమార్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలు కేసీఆర్ కుటుంబం కోసమేనని, ఆ మేధావి ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉండి కరీంనగర్ వరంగల్ రోడ్డు పనులు ఎందుకు చేయలేదన్నారు. వరంగల్ కరీంనగర్ హైవే పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోలేదని, వేల కోట్ల రూపాయలతో రోడ్డు పనులు నేను ఎంపీగా ప్రారంభించాననన్నారు. రైల్వే స్టేషన్ ని పట్టించుకోలేదని, గ్రామాల్లో రోడ్ల కోసం 219 కోట్లు సీఆర్ఎఫ్ నిధులు తెచ్చానన్నారు. గ్రామీణ సడక్ యోజన కోసం 120 కోట్లు తెచ్చిన, ఈ ఐదేళ్లలో కేవలం.రోడ్లకోసం 8వేల కోట్లు తెచ్చిన, కేసీఆర్ పార్లమెంట్ కి పోకుండా దొంగసంతకాలతో హాజరు వేసుకున్నాడు అని ఆయన బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘తెలంగాణ బిల్లు వచ్చినా పార్లమెంట్ కి రాని వ్యక్తి కేసీఆర్. నిధులు తెచ్చింది నేను.. ఆ పనులకు కొబ్బరికాయలు కొట్టింది బీఆర్ఎస్ వాళ్ళు. జగిత్యాల కరీంనగర్ రోడ్డుకు నిధులు బండి సంజయ్ తెచ్చాడు.. స్మార్ట్ సిటీకి 2015 లో నిధులు ఇస్తే 4 ఏళ్ళు దారి మళ్లించారు. స్మార్ట్ సిటీ నిధులు దారి మల్లుతున్నాయని మేము లేఖలు రాస్తే కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. అభివృద్ధి చేశామని అంటున్నవారు కనీసం జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు.. గ్రామాల్లో రాష్ట్రం ఇచ్చిన నిధుల గురించి సర్పంచ్ లను అడగండి తెలుస్తుంది. ఏకగ్రీవ సర్పంచ్ లకు ఇస్తామన్న ప్రోత్సహకలు ఇవ్వలేదు. వేములవాడ, కొండగట్టుకు నిధులు ఇస్తామని మోసం చేశారు.. వేములవాడ, కొండగట్టు ను ప్రసాదం స్కీం కిందకు తీసుకువస్తామని నేను ప్రతిపాదనలు ఇస్తే కనీసం స్పందించలేదు. బండి సంజయ్ గుడి కట్టాడా? బడి కట్టాడా? అని అంటారా? గుడికి ఇవ్వరు.. బడికి ఇవ్వరు… పరదాలు కట్టి మరీ మసీదులను అభివృద్ధి చేశారు.. చిన్న మసీదులను పెద్దగా చేశారు… యాదాద్రి కట్టి వ్యాపార కేంద్రం అన్నారు… బండి సంజయ్ ఎంపీగా ఉండి హిందువుగా 7 సార్లు జైలుకు పోయిండు.. మతం మార్పిడులు, లవ్ జిహాద్ PFI కి వ్యతిరేకంగా పోరాటం చేసింది బండి సంజయ్. మీరు దొంగ హిందువులు కేటీఆర్ వినోద్ ఇద్దరూ నాస్తికులే. భైంసా లో అల్లర్లు జరిగితే ఎక్కడ పోయాడు కేసీఆర్. కేసీఆర్ చేత తాను హిందువుని అని అనిపించింది బీజేపీ. బండి సంజయ్ మీద దొంగ వీడియోలు తయారు చేయాలని కేటీఆర్ చెప్తున్నారు అదే జరిగితే వీపులు సాఫ్ అయితాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.