Siddipet: ట్రాన్స్ జెండర్ గా మారి వేధించిన భర్త.. సుపారి ఇచ్చి చంపించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet: సిద్దిపేటలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త హిజ్రాగా మారి వేధిస్తుండటంతో భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటన కలకలం రేపింది.. గత నెలలో జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. 2014లో సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీ అనే మహిళకు నసరపుర వీధికి చెందిన దరిపల్లి వెంకటేష్‌తో వివాహమైంది. వారికి ఒక పాప ఉంది. వెంకటేష్ అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కానీ వెంకటేష్ ప్రవర్తనలో క్రమంగా మార్పు రావడంతో హిజ్రాగా మారి రోజాగా పేరు మార్చుకున్నాడు. గత ఏడేళ్లుగా మనస్పర్థలు రావడంతో ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే తన కూతురిని తనకు అప్పగించాలంటూ వేదశ్రీని రోజా వేధించేది. దీంతో కొంతకాలంగా సన్నిహితంగా మెలిగిన సిద్దిపేటకు చెందిన బోయిని రమేష్ తో కలిసి రోజాను హత్య చేయాలని వేదశ్రీ నిర్ణయించుకుంది. బోయిని రమేష్‌తో వేదశ్రీ హత్యకు ప్లాన్ చేసింది.
Also Read
రూ.18 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోగా రెండు విడతలుగా రూ.4.60 లక్షలు చెల్లించింది. గతేడాది డిసెంబర్ 11న నసర్‌పురాలోని తన ఇంట్లో రోజా ఒంటరిగా హత్యకు గురైంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన రమేష్ స్నేహితుడు ఇప్పల శేఖర్ రోజాతో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అన్ని కోణాల్లో విచారించగా వేదశ్రీతో పాటు మరో ఐదుగురి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయింది. శనివారం సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు నిందితురాలు వేదశ్రీతో పాటు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. వేదశ్రీ, బోయిని రమేష్, ఇప్పల శేఖర్‌లను శనివారం అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
Top Headlines @ 9AM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!