గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో మేము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచాం. అందుకే గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశాం. గత ప్రభుత్వం పాలనలో తప్పులు జరిగాయి. శ్వేత పత్రాలు నిజమేనని,…
అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ అంశంపై చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను మీడియా ముందు జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసి బోర్లా పడిందని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన…
పదేళ్లలో తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశంలో నెంబర్ వన్‌గా నిలిపామని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డీ నొక్కి చెప్పారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా విద్యుత్‌పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్ బకాయిలు, కరెంట్ సరఫరాపై అధికార పార్టీ చేసిన విమర్శలకు, ప్రశ్నలకు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధీటూగా స్పందించారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ…
శ్వేతపత్రం రాష్ట్రాన్ని దివాళా తీయడానికి పెట్టింది కాదని, వాస్తవం ఏంటన్నది ప్రజలకు పూర్తిగా అర్థం కావడానికే అన్నారు డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో భట్టి శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం శ్వేతపత్రంపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. దేశంతో పోటీపడాలనే రూపకల్పనతోనే శ్వేతపత్రం తీసుకువచ్చామన్నారు. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకానికి ఊహించని స్పందని వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రతిరోజూ 30 లక్షలకు పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా…
Hyderabad: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టోందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మరో పది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. దీంతో ప్రజలంతా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ వేడుకులపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రజలకు, ఈవెంట్ నిర్వహకులకు పలు నిబంధనలు జారి చేశారు. ‘న్యూఇయర్ వేడుకలను రాత్రి 1 గంటల వరకు ముగించాలి. ఈవెంట్ నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. ప్రతీ ఈవెంట్ల…
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఈ కేసుకు సంబధించి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతంలో చంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర రాజకీయాలు వంటి ఇతరత్రా అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం ఢిల్లీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి సాయంత్రానికే హైదరాబాద్ రానున్నారు. ఇక అధిష్టానంతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి…
నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై సోమవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క…
నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య గురైన ఘటన సదా శివనగర్‌లో చోటుచేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులను వరసగా హత్య చేశాడు ఓ సైకో కిల్లర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపన వివరాలు ప్రకారం.. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబంలోని ఆరుగురు వరస హత్యకు గురయ్యారు. 15 రోజుల…