Hyderabad: సన్ బర్న్ ఈవెంట్ నిర్వహకులపై మదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మాదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్ కార్యక్రమాన్ని రద్ద చేశారు. బుక్‌మై షోలో ఈ ఈవెంట్‌కు సంబంధించి టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈవెంట్ నిరర్వహించాలని చూసిన నిర్వహకుడు సుశాంత్ అలియాస్ సుమంత్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అసలు ఈవెంట్‌కు అనుమతి తీసుకోకుండానే సుశాంత్ బుక్ మై షోలో సన్ బర్న్ ఈవెంట్ పేరుతో టిక్కెట్ల విక్రయించడం ప్రారంభించాడు.
Also Read: Central Bank of India Recruitment: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?
అప్పటికే చాలామంది ఈవెంట్ టికెట్లు కొనుగోలు కూడా చేశారు. డబ్బులు వసూలు చేసి ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండా మోసానికి పాల్పడ్డ సుశాంత్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే బుక్‌మై షో, నోడల్ అధికారులకు పోలీసులు నోటీసులిచ్చారు. విశాఖపట్నం వేదికగా జరగబోయే సన్ బర్న్ ఈవెంట్ టికెట్లు మాత్రం విక్రయిస్తున్నారు. అనుమతి తీసుకోకుండానే హైదరాబాద్ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లు విక్రయించడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈవెంట్ నిర్వాహాకులపై చర్యలకు కూడా ఆదేశించిన విషయం తెలిసిందే.
Also Read: Bhatti Vikramarka: ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం