నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్కూల్లో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను కొట్టివేసింది. ఈ జీవో ద్వారా దాదాపు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
తెలంగాణలో పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది.
క్యాట్ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను నిర్ధారించలేమని స్పష్టం చేస్తూ, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనర్థకమని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీపై స్టే ఇవ్వడం జరగదని, సంబంధిత వ్యక్తులు ముందుగా అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.…
TG High Court: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది.
Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఎన్- కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేచ్చారని పిటిషన్ వేశారు.