TG High Court: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది.
Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఎన్- కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేచ్చారని పిటిషన్ వేశారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై 'స్టే' సుప్రీంకోర్టు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే అమలులో ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
Bail For Raj Tarun: నేడు (ఆగష్టు 8 ) నార్సింగి కేసులో హీరో రాజ్ తరుణ్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. లావణ్యతో పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఇకపోతే., 30 సినిమాలకు పైగా రాజ్ తరుణ్ నటించాడని.. రాజ్ తరుణ్ తరుపు న్యాయవాది పేర్కొన్నాడు. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్…
TG High Court Serious: వీధికుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమాయలకుపై కుక్కల దాడులు, వాటి నియంత్రణ చర్యలపై సమావేశాలు, సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చిచెప్పింది.
Telangana High Court: ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములుగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ స్పష్టం చేశారు. కాప్రా మాజీ తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మాజీ సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేయాలని…
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం కావడంపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇక మీద ఇలా జరిగితే కోర్టు ఉల్లంఘనల కిందకు వస్తుందని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011లో రైల్రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
RTC MD Sajjanar: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మాల్ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే..