స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ వేటలో పడిపోతుంటారు యువతీ యువకులు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లలో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అయితే ప్రైవేట్ జాబ్స్ గాల్లో దీపాల్లాగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వందల్లో పోస్టులుంటే లక్షల్లో పోటీపడుతున్నారు. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రయత్నిస్తున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే…
Highcourt Telangana : హైదరాబాద్ అంబర్ పేట్‌లోని బతుకమ్మ కుంటపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు బతుకమ్మ కుంటను ప్రభుత్వమిదేనని స్పష్టం చేసింది. ఈ స్థలాన్ని తమదని, బతుకమ్మ కుంటపై హైడ్రా చర్యలకు స్టే విధించమని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు 2025 జనవరి 7వ తేదీన తుది తీర్పు ఇచ్చింది. Squid Game Viral Video: ‘స్క్విడ్‌గేమ్’లో టాలీవుడ్ స్టార్…
నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
ED Notices KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. జీవో 29ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.
బెయిల్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత జైలు అధికారులు అల్లు అర్జున్ ను విడుదల చేశాయని చెప్పుకొచ్చారు. అయితే, వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ లో స్పష్టంగా ఉన్నప్పటికి.. కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని అడ్వకేట్ అశోక్ రెడ్డి వెల్లడించారు.
Allu Arjun: హీరో అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి ఈరోజు ఉదయం 6.30 గంటలకు విడుదల అయ్యారు. చంచల్‌గూడ జైలు వెనుక గేట్ నుంచి ఆయన వెళ్లిపోయారు. ఇక, అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అర్జున్, మామ చంద్రశేఖర్ ఉన్నారు.
TG High Court: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
పుష్ప 2 సినిమాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన పుష్ప 2 చిత్రం విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు శ్రీ శైలం అనే వ్యక్తి. సెన్సార్ బోర్డు తరపున వాదనలు వినిపించారు డిప్యూటీ సోలిసిటర్ జనరల్. ఈ సినిమా వీక్షించే మార్పులు సూచించిన ఆ తర్వాతే విడుదలకు అనుమతించామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు. Yogi Babu: అందం కాదు బాసూ…
హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను.. నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.