పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
గ్రూప్1 పిటిషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారని జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. ఆయన పిటిషనర్లకు 20వేల జరిమానా విధించారు. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పిటిషనర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19మంది అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్సైట్లో ఉన్న మార్కులకు తేడాలున్నాయన్న పిటిషనర్లు…
Group 1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గ్రూపు-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ 20 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం కోర్టు విచారణ ప్రారంభించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నియామక పత్రాలు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఇటీవల,…
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని సంచలన తీర్పునిచ్చింది. నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై NTV తో దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల బాధిత కుటుంబాలు తమ ఆవేదనను పంచుకున్నాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు ఇచిన తీర్పుపై మేము హర్షం…
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని సంచలన తీర్పునిచ్చింది. 2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 2016లో NIA ఫాస్ట్ట్రాక్కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది.…
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 2016లో NIA ఫాస్ట్ట్రాక్కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్భత్కల్ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. ఈ…
HCU Case: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విషయంలో ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలు, తప్పుడు ఫోటోలను ప్రసారం చేస్తూ కావాలనే వివాదం సృష్టిస్తున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫేక్ ప్రచారంలో యూనివర్సిటీ భూములను అక్రమంగా ఆక్రమించారని, పర్యావరణాన్ని ధ్వంసం చేశారనీ, వన్యప్రాణులకు నష్టం వాటిల్లిందంటూ ఊహాగానాలు వ్యాప్తి చెయ్యడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా…
నార్సింగి పోలీస్స్టేషన్లో సీఎం రేవంత్రెడ్డిపై 2020లో నమోదైన కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకూ నోటీసులు జారీ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. 2020లో కేటీఆర్ ఫాంహౌజ్పైన డ్రోన్ ఎగరేసి చిత్రీకరించారని రేవంత్ రెడ్డి పై అభియోగం మోపారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
High Court: తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెలువరించింది. థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే జనవరి 21న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ మరోసారి ప్రీమియర్, బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా, 16 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని షోలలో ప్రవేశానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. Read Also: Kannappa…