TG High Court: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. లగచర్ల ఘటనలో తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ హైకోర్టు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు.
Read also: KTR: రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువ విలాపమే..
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితర అధికారులపై దాడి చేసిన ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నరేంద్ర రెడ్డితో పాటు మరో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. పట్నం నరేందర్ రెడ్డి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని నవంబర్ 14న ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును ప్రకటించింది. కాగా.. దుద్యాల మండలంలోని నాలుగు గ్రామాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే లగచర్లతోపాటు సమీప గ్రామాలకు చెందిన రైతులు ఫార్మా క్లస్టర్‌కు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం నవంబర్ 29న ఈ భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయగా.. దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 30న మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే..
Pushpa – 2 : ఆ ఇద్దరి BGM వర్క్ ను పక్కన పెట్టిన పుష్ప-2 మేకర్స్