Highcourt Telangana : హైదరాబాద్ అంబర్ పేట్లోని బతుకమ్మ కుంటపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు బతుకమ్మ కుంటను ప్రభుత్వమిదేనని స్పష్టం చేసింది. ఈ స్థలాన్ని తమదని, బతుకమ్మ కుంటపై హైడ్రా చర్యలకు స్టే విధించమని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు 2025 జనవరి 7వ తేదీన తుది తీర్పు ఇచ్చింది.
Squid Game Viral Video: ‘స్క్విడ్‌గేమ్’లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. వీడియో వైరల్
హైకోర్టు బతుకమ్మ కుంటను ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ, ఈ కుంట పునరుద్ధరణలో హైడ్రా తీసుకున్న చర్యలు సక్రమమని పేర్కొంది. 1962 లెక్కల ప్రకారం, మొత్తం 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మ కుంట, కబ్జాల అనంతరం ప్రస్తుతం 5 ఎకరాల 15 గుంటల భూమిగా మాత్రమే మిగిలి ఉందని తాజా సర్వేలో తేలింది.
ప్రభుత్వం తరఫున సంబంధిత పత్రాలు కోర్టుకు సమర్పించి, అనుకూల తీర్పు రావడంలో హైడ్రా లీగల్ బృందం, రెవెన్యూ ఉద్యోగులు కృషి చేశారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆయా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. హైకోర్టు తీర్పుతో, బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా సిద్ధమవుతోంది.
HYDRA : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు.. ఎక్కడంటే..!