GHMC Delimitation: జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ అంశం న్యాయస్థానానికి చేరింది. 300 డివిజన్లకు సంబంధించిన వార్డు మ్యాప్‌లు, జనాభా వివరాలను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలు అమలైతే పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ…
హయత్ నగర్ లోని 102 ఎకరాల అటవీ భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హయత్ నగర్ గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్ సర్వేనెంబర్ 201/1లోని 102 ఎకరాల భూ వివాదం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆ భూమి సాలార్జంగ్ 3 వారసులదేనన్న ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. 1248హెచ్ సంవత్సరం నాటి సేల్ డీడ్ చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ లిమిటేషన్ గడువు దాటిందని వెల్లడించింది.…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అనేక వాయిదాల అనంతరం రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు, ప్రీమియర్ షోల నిర్వహణకు ముందు తెలంగాణ హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు (డిసెంబర్ 11) తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్…
High Court: ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల.. హిందీ మహావిద్యాలయ అటానమస్ రిజిస్ట్రార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గుర్తింపు రద్దు వివాదం నేపథ్యంలో అడ్మిషన్‌ల నిమిత్తం అధికారిక వెబ్‌సైట్‌లో కాలేజీ పేరును చేర్చాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రార్ కోర్టుకు హాజరై వివరాణ ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ యూనివర్సిటీ 2012 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. యూనివర్సిటీలో 2012 నియామకాలు చెల్లవంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు విచారణ జరిపి ఈ మేరకు తీర్పును వెల్లడించింది. తాజా తీర్పు కారణంగా 45 మందికి పైగా ప్రొఫెసర్లు ఉద్యోగాలను కోల్పోనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. Also Read: T20 World Cup 2026: అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్.. పాక్…
PD Act on Angur Bhai: హైదరాబాద్ లోని దూల్‌పేట కేంద్రంగా హైదరాబాద్ నగరంలో గంజాయి వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లేడీ డాన్ అరుణ్ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెట్టిన పీడీ యాక్ట్ (PD Act)ను సవాలు చేస్తూ అంగూర్ భాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. Nara Lokesh: దూసుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్.. నిరంతర పర్యవేక్షణ,…
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల నమోదుపై హైకోర్టులో జరిగిన విచారణ ముగిసింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీం…
Bhatti Vikramarka : బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకోర్టు తీర్పుపై స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తి అవగాహన చేసుకుని తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “హైకోర్టు 2025 సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరపాలని స్పష్టంగా చెప్పింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మేము గట్టి ప్రయత్నం చేశాం. కానీ, 2018లో బీఆర్‌ఎస్…