ED Notices KTR: విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..
- ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు..
- జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసులు..
- సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి నోటీసులు..
- జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Notices KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇవాళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణ కు రావాలని నోటీసులో పేర్కొంది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే గుర్తించిన ఈడీ. FEO కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది.
Read also: KTR: మన్మోహన్ సింగ్‌తో కేసీఆర్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ‘కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని’ ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా.. విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
TG Cold Weather: మరోసారి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలుచోట్ల కమ్ముకున్న పొగమంచు
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు