Genco CMD Prabhakar Rao comments on Central Electricity Amendment Bill: కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు వల్ల విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టాలు వస్తాయని అన్నారు జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు. ఇప్పటికే ఈ విద్యుత్ సవరణ బిల్లును సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని.. బిల్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేశారని అన్నారు. ఈ చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని అన్నారు. త్వరలో విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు…
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యింది.. జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నల కోసం నూతన బీమా పథకాన్ని ప్రారంభించనుంది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ పొంగిపొర్లడంతో దాదాపు 3000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇక్కడ గుర్తు చేశారు. గురువారం ఉదయం నుంచి కొంత విరామం లభించినప్పటికీ కూకట్పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అల్వాల్, అమీర్‌పేట్, పంజాగుట్ట,…
తెలంగాణలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. విద్యా శాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అనుమతిపోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ జాతీయ హోదా కల్పించాలని కోరారని.. అయితే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని ఆయన వెల్లడించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టును…
టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీని, నన్ను అవమానకరంగా తిట్టారని, పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్ సీ ఐని ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. పేదలకు బియ్యం అందకుండా చేసిందని.. ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.
జూలై 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈసమావేశం ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి, విధానాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై పోరాటాలని పిలుపునివ్వనున్నారు. ఈనేపథ్యంలో.. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా…
మన ఊరు – మన బడి’ ఓ ప్రచారార్భాటం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తెలంగాణరాష్ట్రంలో పేద పిల్లల చదువుకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని మండిపడ్డారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక వెలవెలబోతున్నాయని విమర్శించారు. ఓ ప్రచార అర్భాంటంగా ‘మన ఊరు – మన బడి’ తయారైందని మండిపడ్డారు.…
తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ కిట్’ పథకం సూపర్ డూపర్ హిట్ అయిందని సీఎం కేసీఆర్ పలుమార్లు పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఈ స్కీమ్‌లో భాగంగా 2022 ఫిబ్రవరి నాటికి 10 లక్షలకు పైగా కిట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కిట్‌లో మరిన్ని ఐటమ్స్ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయిన మహిళకు, పుట్టిన బిడ్డకు ఈ కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు…