Job Notification: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బోధించాలని ఆసక్తి కలిగి ఉండి.. గవర్నమెంట్ జాబ్ రాలేదని బాధపడుతున్న వారికోసం ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. గురుకులాల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో బోధన సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 15 మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, జియాలజీ, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, కామర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ తో పాటు..హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్ మెంట్, జియోగ్రఫీ తదితర కోర్సుల్లో బోధించే అనుభవం గల లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి డెమో నిర్వహిస్తామన్నారు. ఎంపిక చేయబడిన లెక్చరర్స్ గంటల ప్రకారం పని చేయాల్సి ఉంటుందని మల్లయ్య బట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా జిల్లాల మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల ఆర్ సి వోలకు తమ దరఖాస్తులు అందించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12 ఆఖరి తేదీ అని ఆయన వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: ఏపీ విద్యాశాఖలో తొలిసారి ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టు
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రిలోనూ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషయిన్, రిసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12 ఆఖరి తేదీ.