Talasani Srinivas Yadav: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న గోపాలమిత్రలకు దసరాకు ఒకరోజు ముందే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీపికబురు అందించారు. ప్రస్తుతం గోపాల మిత్రలకు నెలకు రూ.8,500 చెల్లిస్తుండగా.. 30శాతం జీతం పెంచనున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం అంటే రూ.2,550 పెంచి మొత్తం రూ.11,050 ఇస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడమే కాకుండా…
Distribution of Bathukamma sarees from today: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కోటి మందికిపైగా లబ్దిదారులకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 24 రకాల డిజైన్లు, 10 ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్తో చీరలను ప్రభుత్వం తయారుచేయించింది. ఇందుకోసం రూ.339 కోట్లు ఖర్చుచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం సాగుతుంది. రాష్ట్రంలోని ఈ…
సెప్టెంబర్ 17పై తెలంగాణలో ఇప్పుడు రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి… కొందరు చరిత్రను అనుగుణంగా మాట్లాడితే.. మరొకరు చరిత్రను వక్రీకరిస్తూ తమకు అనుకూలంగా మార్చుకునేవాళ్లు ఉన్నారు.. తెలంగాణ సాయుధ పోరాటంతో అసలు సంబంధం లేనివాళ్లు కూడా.. దానిని ఐజాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంతకీ సెప్టెంబర్ 17న అసలేం జరిగింది.. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఏకమై పోరాటాలు చేసిన ఆ పోరాటం జరిగింది.. భూమి కోసం.. భుక్తి కోసం..…
సెప్టెంబర్ 17పై తెలంగాణలో రాజకీయం రంజుగా జరుగుతోంది. పార్టీలన్నీ వేడుకలను తలో పేరుతో నిర్వహిస్తున్నాయి… విలీనం అని ఒకరు.. విమోచనమని మరొకరు.. విద్రోహమని ఇంకొకరు.. ఇలా పలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.. పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు జరిపారు. తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ…
Pocharam Srinivas Reddy comments on Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శలు తెలంగాణలో కాకాపుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సీతారామన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తాజాగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందించారు. నేను బన్సువాడ ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రిగా మీ ముందుకు వచ్చానని.. స్పీకర్ హోదాలో మాట్లాడటం లేదని ఆయన అన్నారు. నిర్మలా సీతారామన్ నాకు…
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ ఇచ్చిన డెడ్లైన్ రేపటితో ముగియనుంది. రాజాసింగ్ వ్యాఖ్యల మూలంగా హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోను వ్యతిరేకిస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పాతబస్తీ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్…
BJP Political War: రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. అటు బండి సంజయ్, ఇటు రాజాసింగ్ ఇళ్ల వద్ద పోలీసుల పహారా కట్టుదిట్టం చేశారు. ఈనేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో అరెస్టులు, నిర్బందాలపై నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్పై ముస్లీములు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజాసింగ్ ను 24 గంటల్లో అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అదుపులో తీసుకున్నారు.…