K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K Laxman Fires On BRS Govt Over TSPSC Paper Leak: తెలంగాణ యువత బతుకుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసిందని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని పేర్కొన్నారు. ఈ లీకుల్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువతల అశలపై నీళ్ళు పోశారని మండిపడ్డారు. సిట్ విచారణపై తమకు నమ్మకం కుదరడం లేదని, అనేక కేసుల్లో సిట్‌ల విచారణ వేగవంతంగా జరగలేదని అన్నారు. నయీమ్ కేసు నుంచి మొన్నటి డ్రగ్స్ కేసు వరకు.. సిట్ విచారణలేమీ తేలలేదన్నారు. అవినీతి కేసుల్ని మూసివేసే దాంట్లో రాష్ట్ర ఏసీబీకి దేశంలోనే గొప్ప పేరుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ కేసుల విచారణ జరుగుతోందని చెప్పారు.
Talasani Srinivas Yadav: మేము కమిట్మెంట్‌తో పని చేస్తుంటే.. బీజేపీ కుట్రలు చేస్తుంది
Also Read
గతంలో కూడా ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 26 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్యమాలకు వేదికగా మారబోతుందన్నారు. లిక్కర్ కేసులో నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారని.. విచారణ ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పించుకునే మార్గాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారే తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారన్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో అనేకమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈడీ విచారణను ఎదుర్కున్నారన్నారు. ఇక బీజేపీలో అందరూ ఐక్యంగానే ఉన్నామని, అసమ్మతి లేదని ఎంపీ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!