రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు మరోసారి తన దాడితో సంచలనాన్ని సృష్టించారు. భూమి సర్వే కోసం లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల మండల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ అనే వ్యక్తికి చిన్న బోనాలలో మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని సర్వే చేయడంలో భాగంగా సర్వేయర్ వేణు రూ.30 వేలు…
ACB Raids: విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ ఆరోపణల కింద కేసు నమోదు చేసి, అంబేద్కర్‌తో పాటు ఆయన సన్నిహితులు, బినామీల నివాసాల్లో 15 బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. Ayyanna Patrudu: అసెంబ్లీకి రాకపోతే జీతం…
భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. నరసింహారావు అనే ఈ అధికారి, ఎరువుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిబ్బంది నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.
Muralidhar Rao : నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సోదాలు సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. మురళీధర్ రావు నివాసమైన బంజారాహిల్స్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దర్యాప్తులో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన భారీ స్థిరాస్తులు,…
KTR : హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను ఏసీబీ అధికారులు మూడున్నర గంటలపాటు విచారించారు. ఈ విచారణ సందర్భంగా కేటీఆర్‌ను ప్రశ్నలతో ఏసీబీ అధికారులు నరకాడేశారు. ఆయన సమాధానాలు, సమర్పించిన వివరాలన్నీ అధికారులు శ్రద్ధగా నమోదు చేశారు. ముఖ్యంగా ఆయన పాత్రపై ఇప్పటికే కొన్ని అధికారులు స్టేట్‌మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో విచారణ మరింత ఉత్కంఠతరంగా మారింది. ఏసీబీ అధికారులు…
ACB Raids : కరీంనగర్‌కు చెందిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీధర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం తెల్లవారుజామున భారీగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్‌పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చారు. కరీంనగర్, సిద్ధిపేట్, వరంగల్, హైదరాబాద్ సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని…
ACB Raids: తెలంగాణలో భారీ అవినీతికి సంబంధించి మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్‌కు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ప్రస్తుతం చొప్పదండిలోని SRSP క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఇరిగేషన్ CAD డివిజన్ 8లో పనిచేశారు. ఆయన…
ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా ఆస్తులు కూడాబెట్టుకున్న అవినీతి అధికారి ఏసీబీ భరతం పట్టింది. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణలో కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడి జరిపింది. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించింది. హరిరామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది ఏసీబీ. Also Read:Pahalgam terror attack: ‘‘హిందువునని గర్వంగా ప్రాణత్యాగం…
కాలేశ్వరం ఈఎన్సీ హరి రామ్ ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో అవి వందల కోట్లు విలువ చేస్తాయంటున్నారు ఏసిబి అధికారులు. కాళేశ్వరం ఈఎన్సీ హరి రామ్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. 13 చోట్ల భారీగా నివాస స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఈఎన్సీ హరి రామ్, అతని బంధువుల ఇండ్లల్లో 13 చోట్ల ఏసీబీ…
BRS Formation Day : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామం ఈరోజు గులాబీ వాతావరణంలో నిండిపోయింది. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సభ కోసం మొత్తం 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టగా, ఇందులో 159 ఎకరాల్లో సభాప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం నుండి ఎల్కతుర్తి వరకు…