ACB Raids: తెలంగాణలో భారీ అవినీతికి సంబంధించి మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్‌కు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ప్రస్తుతం చొప్పదండిలోని SRSP క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఇరిగేషన్ CAD డివిజన్ 8లో పనిచేశారు. ఆయన గతంలో అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులలో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనూ పనిచేసారు.
Read Also: WTC Final: నేడే WTC ఫైనల్.. ఆసీస్ దూకుడుకి ప్రొటీస్ బ్రేక్ వేయగలదా..?
ఇరిగేషన్ శాఖలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన నూనె శ్రీధర్ వాటిలో అక్రమంగా వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ చర్యలు ప్రారంభించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఆయన నివాసాల వద్ద, ఇతర సంబంధిత ప్రదేశాలపై కూడా ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఇక దాడిలో ఎటువంటి ఆస్తులను గుర్తించారో తెలియాల్సి ఉంది.
Read Also: Mulugu: ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..!