Bribe: భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. నరసింహారావు అనే ఈ అధికారి, ఎరువుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిబ్బంది నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం, ఎరువుల దుకాణం నిర్వహణకు సంబంధించిన అనుమతుల విషయంలో సాయం చేస్తానని హామీ ఇచ్చిన నరసింహారావు, వ్యాపారవేత్త నుంచి రూ.25 వేల లంచం కోరాడు. దీనిపై విసిగిపోయిన వ్యాపారవేత్త ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
CM Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత ఇచ్చినా తక్కువే
ముందుగా పథకం ప్రకారం ఉచ్చుపన్నిన ఏసీబీ, నరసింహారావు లంచం తీసుకుంటున్న క్షణంలోనే పట్టుకుని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారి ఇల్లు, కార్యాలయంలో శోధనలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. అధికారిక స్థానాన్ని వాడుకొని లంచాలు డిమాండ్ చేసే అధికారులపై ఏసీబీ దాడులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.