Muralidhar Rao : నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సోదాలు సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. మురళీధర్ రావు నివాసమైన బంజారాహిల్స్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దర్యాప్తులో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన భారీ స్థిరాస్తులు, విలువైన వస్తువులు వెలుగు చూశాయి.
CM Chandrababu: అసలుసిసలు తెలుగు బిడ్డ పీవీ.. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం..
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో విల్లా, బంజారాహిల్స్‌లో ఫ్లాట్లు, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేట్ ప్రాంతాల్లో స్థిరాస్తుల సమాచారం లభించింది. కరీంనగర్, హైదరాబాద్‌లలో వాణిజ్య భవనాలు, కోదాడలో అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో 2 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ కూడా గుర్తించబడింది. 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లు, మోకిళ్ళలో 6,500 చదరపు గజాల భూమి, మెర్సిడెస్ బెంజ్ కారు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు సోదాల్లో బయటపడ్డాయి.
ప్రాథమికంగా వీన్నీ అధికారిక హోదాను దుర్వినియోగం చేసి సంపాదించిన ఆస్తులుగా అధికారులు నిర్ధారించారు. అక్రమాస్తుల కేసులో మురళీధర్ రావుతో పాటు ఆయన బంధువులపై కూడా కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతోంది.
UP: యూపీలో ఘోరం.. ప్రేమికుడి కోసం కన్నకూతుర్ని చంపేసిన ఇల్లాలు