KTR : హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను ఏసీబీ అధికారులు మూడున్నర గంటలపాటు విచారించారు. ఈ విచారణ సందర్భంగా కేటీఆర్‌ను ప్రశ్నలతో ఏసీబీ అధికారులు నరకాడేశారు. ఆయన సమాధానాలు, సమర్పించిన వివరాలన్నీ అధికారులు శ్రద్ధగా నమోదు చేశారు. ముఖ్యంగా ఆయన పాత్రపై ఇప్పటికే కొన్ని అధికారులు స్టేట్‌మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో విచారణ మరింత ఉత్కంఠతరంగా మారింది. ఏసీబీ అధికారులు మొదటగా ప్రైవేటు సంస్థ FEOతో కుదిరిన ఒప్పందాలపై వివరాలను అడిగారు. ప్రభుత్వ హస్తక్షేపం ఏ మేరకు ఉండాలి? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP)గా నిర్వాహణ జరుగుతున్నా, ప్రభుత్వం ఎందుకు నేరుగా డబ్బులు పంపించిందన్నదే కీలకంగా మారింది.
Hardoi Petrol Pump: కాల్చి పడేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగిపై రివాల్వర్ గురి పెట్టిన యువతి.. చివరకు
ప్రభుత్వం FEOతో కేవలం సివిల్ వర్క్స్ వరకే ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్నా, బియాండ్ ద్యాట్ చర్యలు ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు ఎదురయ్యాయి. రేస్ నిర్వహించే ప్రాంతంలో మౌలిక వసతులు – రోడ్లు, పార్కింగ్, వేదికలు నిర్మించడమే ప్రభుత్వ పని కాగా… అంతకు మించి క్యాష్ ట్రాన్స్ఫర్లేమిటన్నదే దర్యాప్తులో కీలకం. ప్రైవేటు సంస్థ FEOకి ఏ అధికారమూ లేకుండా హెచ్ఎండీఏ నుంచి రూ.56 కోట్లు ఎందుకు పంపించారన్నది మరో కీలక ప్రశ్న. ఆర్‌బీఐ అనుమతి లేకుండా యూకే ఫౌండ్‌ల రూపంలో నిధులు పంపడం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు “కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశాం” అని స్టేట్‌మెంట్లు ఇచ్చినట్టు సమాచారం. దీంతో కేటీఆర్ సమాధానాల పట్ల అధికారులు తృప్తిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ మీడియా ఎదుట “నేను నిర్దోషిని”, “ప్రతీకార రాజకీయాలే ఇవి” అంటూ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో విచారణలో ఎదురయ్యే ప్రశ్నలు మరింత గంభీరంగా మారాయి. తాను నిజంగా ఈ వ్యవహారానికి దూరమైతే… అధికారులు ఎందుకు బలవంతంగా డబ్బులు పంపించారన్న వాస్తవాన్ని సమర్థించలేకపోతున్నారని భావిస్తున్నారు. ఈ విచారణ ఇంకా కొనసాగుతుండగా, కేటీఆర్‌పై ఏసీబీ తదుపరి అడుగులు ఎలా ఉండనున్నాయన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
AP Govt: ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల.. వారికి మాత్రం తప్పనిసరి!