బీజేపీలో బీజేపీలో మహేశ్వర్ రెడ్డి చేరారు. కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన ఆయన ఇవాల ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కషాయి కండువా కప్పుకున్నారు. ఇవాల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన నడ్డా సమక్షంలో బీజేపీ చేరారు.
సింగరేణి ప్రైవేటీకరణకు అడుగు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలంగాన కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని సీఎల్సీనేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా లో ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి కేసీఅర్ అని మండిపడ్డారు.
బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మన్, బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు,సింగరేణి సంస్థ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెండు లేఖలు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు.
Telangana Congress: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చెరుకు సుధాకర్ మధ్య జరిగిన పంచాయితీ తెలంగాణ హైకోర్టుకు చేరింది. చెరుకు సుధాకర్ కుమారుడికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనను బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెరుకు సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హత్యాయత్నం నేరం కింద కేసు…
బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు మూడుకూడా ముకుమ్ముడి బీఆర్ఎస్ పై దాడి చేసేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు.
బీజేపీతని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధాని వ్యవహారంలో రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు.
KCR అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే KCR మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా హాజరయ్యారు.