Jagga Reddy: గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని అన్నారు. నేను ఎవరి పేర్లు తీసుకోదల్చుకోలేదంటూ జగ్గారెడ్డి అన్నారు. ఇది మీడియాకి చెప్పడానికి కారణం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పారీ నాయకులకు , కార్యకర్తలకు , అభిమానులకు, ఓటర్లకు సమాచారం ఉండాలనే నా ఆవేదన తెలియచేశానని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Lemon Juice: నిగనిగలాడే నిమ్మరసం.. బెస్ట్ రిఫ్రెష్ డ్రింక్
గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ నేత టి.జగ్గారెడ్డి పాతకాలాన్ని తలుచుకుంటూ కుంగిపోయినట్లు కనిపిస్తోంది. ఐదు నెలలు కావస్తున్నా ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. ఇప్పుడు పూర్తిగా నా నియోజకవర్గంపైనే దృష్టి పెడుతున్నానన్నారు. గాంధీ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని చెప్పారు. అయితే తాను ఏ పార్టీలో చేరాలన్నా, సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన చేయడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవచ్చు, కానీ మేము కలిసి ఉంటామని క్లారిటీ ఇచ్చారు. “భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో తన పనిని ఆస్వాదించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. “మేము అనేక సార్లు సీనియర్ నాయకులతో ముఖ్యమైన విషయాలను చర్చించాము,” అని చెప్పుకొచ్చారు. ఇఫ్తార్ పార్టీకి హాజరైన పార్టీ అగ్ర నాయకుడితో తన ఆలోచనలను పంచుకున్నాడు. పాత రోజుల్లో లాగా గాంధీభవన్‌లో కూర్చోలేకపోతున్నట్లు, ఉండలేకపోతున్నట్లు కూడా ఆయన చెప్పారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగ్గారెడ్డి లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మునుపటిలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ప్రశాంతత కరువైందన్నారు. తన మనసులో ఎన్నో బాధలు ఉన్నాయని, వాటిని చెబితే ఏమౌతుందో.. చెప్పకపోతే ఏమవుతుందోనని ఆందోళన ఉందని జగ్గారెడ్డి తెలిపారు.
Telangana Bhavan: బీఆర్‌ఎస్ ఆవిర్భావ సంబురాలు.. పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం