Bandi Sanjay: మాయ మాటలు చెప్పేందుకే 21 రోజులు కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. మాయ మాటలు చెప్పేందుకు 21 రోజులు కేసీఅర్ కార్యక్రమాలు చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత, గోవింద్ రాటి , మనోజ్ లు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కేంద్రం సంక్షేమ కార్యక్రమాలను నీరుగారుస్తున్నరని అన్నారు. కేంద్రంలో, యూపీలో బీజేపీ సర్కార్ లు ఉన్నాయి కాబట్టి అక్కడ పథకాలు బాగా అమలు అవుతున్నాయని అన్నారు. అయుష్మన్ భారత్ నిధులను దారి మళ్ళిస్తుంది కేసీఅర్ సర్కార్ అంటూ ఆరోపించారు. తెలంగాణలో మిషన్ భగీరథ పెద్ద స్కాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్కీమ్ ఇప్పటికీ సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే స్కీమ్ లు బాగా అమలు అవుతాయని అన్నారు. కేంద్రానికి, మోడీకి మంచి పేరు వస్తుందని స్కీమ్ లను కేసీఅర్ అమలు చేయడం అన్నారు.
Read also: Mahesh Kumar Goud: గల్లీ లీడర్ లా బండి సంజయ్ మాటలు.. కార్పొరేటర్ స్థాయి లీడర్లు కూడా బీజేపీ లేరు
Also Read
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
కేసీఅర్ విశ్వాస ఘాతకుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ నాయకులు ఫోన్లు ఎత్తలేదని, కాంగ్రెస్ కు ఫండ్ ఇచ్చారు కేసీఅర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు తెలంగాణకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి కేసీఅర్ ఫండింగ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుంది ? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కి పోటీ బీజేపీ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ ను లేపెందుకు కేసీఅర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుందని అన్నారు. మాయ మాటలు చెప్పేందుకు 21 రోజులు కేసీఅర్ కార్యక్రమాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రామ రాజ్యం రావాలని బండి సంజయ్ తెలిపారు.
Justice for VOA: కలెక్టరేట్ ముందు విఓఏల ఆందోళన.. సమస్యలను పరిష్కరించాలని నిరసన
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!