MLA Seethakka: పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం అందించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటన కొనసాగుతుంది.
Bandi Sanjay Chitchat: రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం నాకు చేతకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నాకు చేతకాదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Bhatti vikramarka: 2016లో నీళ్లు ఇస్తామని చెప్పిన మంత్రి హరీష్ రావు 2023 లో కూడా అదే మాట చెప్పడం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్ వేశారు.
Bhatti vikramarka: బిఆర్ఎస్ పాలనకు ఉన్నదీ ఇక రెండు నెలల సమయమే ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 78వ రోజు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండలం అనంతవరం గ్రామానికి చేరుకున్న సందర్భంగా భాజా భజంత్రీలు కొమ్ము బూరలు, డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.
KTR: మంచి పనితీరు కనబర్చినవారికే ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం అంటున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని కేటీఆర్అన్నారు.
Minister Harish rao: గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి, కేసిఆర్ పాలనలో సీన్ రివర్స్ అయిందని తెలిపారు. పని చేయరు... చేసే వారిని విమర్శిస్తారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
Harish rao: మూడోసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆరే అని, కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలోమంత్రి హరీశ్రావు ప్రసంగించారు.
తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందకు కారణమని చెప్పొచ్చు.. కర్ణాటక జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం చర్చించేందుకు ఎల్లుండి ( ఈ నెల 26న ) ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.