Harish rao: మూడోసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆరే అని, కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమావేశంలోమంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందకు కారణమని చెప్పొచ్చు.. కర్ణాటక జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం చర్చించేందుకు ఎల్లుండి ( ఈ నెల 26న ) ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
K. Laxman: ధన్యవాద్ మోడీ పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయించిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహా సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధాని స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు నివేదిక రూపంలో ప్రజల ముందుకు రానున్నామని తెలిపారు.
Puvvada Ajay Kumar: మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జనం బీఆర్‌ఎస్ ను ఇంటికి పంపించటానికి సిద్ధంగా ఉన్నారని, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులకు నిద్ర పట్టడంలేదని పొంగులేటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Bandi Sanjay: బిజెపి సింగిల్ గా పోటీ చేస్తుంది. మాయ మాటలు చెప్పేందుకు 21 రోజులు కేసీఅర్ కార్యక్రమాలు చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jagga reddy: నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిందని జగ్గారెడ్డి వెల్లడించారు. తన ఫేస్ బుక్ పేజీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి రకరకాల పోస్టులు పెడుతున్నారని జగ్గారెడ్డి వివరించారు.
Jagga Reddy: గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని అన్నారు.