రాహుల్ గాంధీని ఇల్లు ఖాలీ చేయమనడం బీజేపీ కక్ష్య సాదింపే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాల పట్ల బీజేపీకి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డి.శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ కాంగ్రెస్ లోకి చేరునున్నారు. దీనిపై ఆయన తండి డీ. శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఇవాల ఆదివారంనాడు గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టనున్నారు.
రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలు, ఆయన వెంట ఉన్న వాళ్లందరూ దొంగలు అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లలో సమానం అన్నారు.
ఆంధ్రావాళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ కుటుంబాన్ని జీవన్ రెడ్డి పరామర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ల పై నేను చేసిన వ్యాఖ్యలు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అసలు ఆ ప్రస్తావన తేలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కుట్రను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బయట పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరవాత అధికారం పంచుకోవాలని కాంగ్రెస్ , BRS డిసైడ్ అయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీ లు కలిసి పోటీ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు పై మాట్లాడిన కోమటి రెడ్డి పై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.