Jagga reddy: నిత్యం ఆసక్తికర కామెంట్లతో వార్తల్లో నిలిచే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిందని జగ్గారెడ్డి వెల్లడించారు. తన ఫేస్ బుక్ పేజీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి రకరకాల పోస్టులు పెడుతున్నారని జగ్గారెడ్డి వివరించారు. అయితే గతంలో కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపిన జగ్గారెడ్డి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫేస్ బుక్ పేజీ హ్యాక్ కావడంతో మరోసారి సైబర్ టీమ్ కు ఫిర్యాదు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇలా హ్యాక్ అవ్వడం మన దురదృష్టకరం అన్నారు. హ్యాక్ చేసిన తర్వాత పోస్ట్ చేయడం దరిద్రం.. ఆ పోస్ట్‌పై దరిద్రంగా కామెంట్లు పెట్టే వాళ్లు ఉంటారు కదా అది ఇంకా దరిద్రం అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి పోస్టులకు ఎవరూ అయోమయానికి గురికావద్దని.. ఫేస్ బుక్ ఫాలోవర్స్ అందరూ గమనించాలని జగ్గారెడ్డి కోరారు.
Read also: Auto workers: యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా.. మద్దతుగా భట్టివిక్రమార్క
ఇదిలా ఉంటే.. తాను కూడా పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి తాజాగా కొత్త ప్రస్తావన తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీపీసీసీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్ర చేయగా.. తాము కూడా పాదయాత్ర చేయాలని నాయకత్వానికి విన్నవించారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌కు లేఖ కూడా రాశారు. రేవంత్, భట్టి పోటీ చేయని 47 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే అధికార యంత్రాంగం నుంచి కూడా అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ పాదయాత్ర ఎవరికీ వ్యతిరేకంగా చేయలేదని కూడా స్పష్టం చేశారు. పాదయాత్ర ఎవరు చేసినా పార్టీకి మేలు జరుగుతుందన్నారు. అయితే ఈ విషయంపై అధికార యంత్రాంగం ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.
Tamilnadu : తమిళనాడులో దారుణం.. ఐదుగురు చిన్నారులపై గ్యాంగ్ రేప్