Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గ్రామంలో ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్‌రెడ్డిని ఎస్‌ఐ లోకేష్ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేసిన ఎస్‌ఐ లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఎస్పీలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. దీంతో స్పందించిన సూర్యాపేట ఎస్పీ, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఫోన్ చేశారు. మునగాల ఎస్సై పై చర్యలు తీసుకోవాలని లేదంటే ఇవాళ దీక్ష చేపడతామని ఉత్తమ్ కుమార్ పిలునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట ఎస్సై ఫోన్ చేశారు. మునగాల ఎస్సై పై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. దీక్ష వాయిదా వేసుకోవాలని సూచించారు. దీంతో ఇవాళ కోదాడలో తలపెట్టిన దీక్ష ఉత్తమ్ వాయిదా వేసుకున్నారు. మూడు రోజుల్లో ఎస్సై పై చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున దీక్ష చేస్తామని ఎస్పీకు తెలిపారు ఉత్తమ్.
Read also: Adimulapu Suresh: సీఎం జగనే వైఎస్ వివేకా కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారు..
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గ్రామంలో ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్‌రెడ్డిని ఎస్‌ఐ లోకేష్ అరెస్ట్ చేయడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేసిన ఎస్‌ఐ లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఎస్పీలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. నిన్న సాయంత్రంలోగా ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ ఐపై చర్యలు తీసుకోకుంటే ఇవాల కోదాడలో దీక్ష చేపడతామని హెచ్చరించారు.
అసలేం జరిగింది..
తిమ్మారెడ్డి గ్రామంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా హాజరయ్యారు. కాగా, కార్యక్రమానికి హాజరైన ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్ రెడ్డి జైభీమ్ అంటే ఏమిటో చెప్పాలని అక్కడున్న కళాకారులతో ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తనపై ఎస్‌ఐ లోకేష్, ఇతర పోలీసులు పిడిగుద్దులతో దాడి చేశారని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీటీసీనని చెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల దాడిలో కుడికంటికి తీవ్ర గాయమైందని తెలిపారు. ఇది ఇలా ఉండగా తాను ఎవరిపై దాడి చేయలేదని మునగాల ఎస్సై లోకేష్ వివరణ ఇచ్చారు. సభను అడ్డుకోవడంతోనే వారిని అక్కడి నుంచి తరలించామని దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
Kishan reddy vs Harish rao: ఎంఎన్ జే కొత్త బ్లాక్ ఓపెన్ చేసి.. మధ్యలోనే వెళ్లిపోయిన కిషన్ రెడ్డి