Bhatti Vikramarka Counter To Etela Rajender Comments: ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ఎజెండాలో భాగంగానే.. అయిపోయిన మునుగోడు ఎన్నికలపై ఈటల మాట్లాడారని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీలో ఈటల కూడా అతిపెద్ద వాటాదారుడేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆస్తుల ధ్వంసంలో, దోపిడీలో ఈటల కూడా భాద్యుడే, భాగస్వాముడేనని ధ్వజమెత్తారు. ఈటల లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై, అధ్యక్షుడిపై బురదజల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమది వ్యాపారస్తుల పార్టీ కాదని.. నిన్నటిదాకా ఈటల ఉన్న భూస్వాముల పార్టీ తమది కాదని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, ప్రజల ఇచ్చే విరాళాలతోనే తాము ఎన్నికలు జరుపుకుంటూ వచ్చామని పేర్కొన్నారు. తామెప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్న ఆయన.. నీతి, నిజాయితీగా ఉంటూ వస్తున్నామన్నారు. మీకున్న అలవాట్లే.. కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయనే భావనతో మాట్లాడటం సరైంది కాదని రివర్స్ ఎటాక్ చేశారు.
Etela Rajender: రాజ్యాధికారం రావాలంటే చేతల్లో చూపించాలి
కాగా.. ఇటీవల ఓ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనివ్వడం లేదన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం కేసీఆరేనని చెప్పారు. అంతేకాదు.. మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీలోకి చేరికలు లేకపోవడం వల్ల.. ఫ్రస్ట్రేషన్‌లో ఈటల ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈటల ఆరోపణలు వ్యక్తిగతమా, బీజేపీ పార్టీవో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయని.. ఒకవేళ ఈటల చెప్పినట్టు కాంగ్రెస్‌కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చి ఉంటే, ఆ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్నదన్న భయం బీజేపీలో కనిపిస్తోందని.. గప్పాలు కొట్టి ఈటల బీజేపీలో చేరారని విరుచుకుపడ్డారు. రూ.18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొన్నారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ఈటల బీజేపీలో చేరారని వ్యాఖ్యానించారు.
Helicopter Blades: హెలికాప్టర్‌తో సెల్ఫీ.. రెక్క తగిలి ప్రభుత్వ అధికారి మృతి