Bhatti vikramarka: బిఆర్ఎస్ పాలనకు ఉన్నదీ ఇక రెండు నెలల సమయమే ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 78వ రోజు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండలం అనంతవరం గ్రామానికి చేరుకున్న సందర్భంగా భాజా భజంత్రీలు కొమ్ము బూరలు, డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సామాజిక తెలంగాణ నిర్మాణం జరుగుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో బిఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఏ ఒక్క లక్ష్యం నెరవేరలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నాలుగున్నర కోట్ల ప్రజలు బాగుపడతారని మన నీళ్లు, మన సంపద, మన కొలువులు మనకే వస్తాయని ఎన్నో కలలుగని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్విగ్నంగా ఉన్న పరిస్థితుల్లో ధైర్యం చేసి ఇప్పుడు బిల్లు పెట్టకుంటే ఇక తెలంగాణ రాదు అని ధైర్యం చేసి డిప్యూటీ స్పీకర్ గా తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేశానని తెలిపారు.
తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్న కలలకు భిన్నంగా కేసీఆర్ పరిపాలన ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ పరిపాలనలో ప్రజలు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. మన కొలువులు మనకే అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ ఆశలు నెరవేరలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించి ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేసామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్న భర్తీ చేయకుండా నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేస్తుందన్నా మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు నెలకు 4వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు తప్ప బీఆర్ఎస్ పాలనల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023- 24 సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి స్థలాలు లేని పేదల కోసం భూములు కొనుగోలు చేసి ప్లాట్లు చేసి ఇంటి స్థలాలు పంపిణీ చేసి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు.
రైతుబంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అరిగోసపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యంపై 12 కేజీలు తరుగు కొడుతూ రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలువున మంచుతుందన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతుల అప్పులకు వడ్డీలు పెరిగి ఇర్రేగ్యులర్ అకౌంట్స్ గా మారాయని ఆరోపించారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు తెచ్చుకొని తీర్చలేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట నియోజకవర్గం ఉమామహేశ్వర, చెన్నకేశవ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి విస్మరించడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016లో నీళ్లు ఇస్తామని చెప్పిన మంత్రి హరీష్ రావు 2023 లో కూడా అదే మాట చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనకు ఉన్నదీ ఇక రెండు నెలల సమయమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ లు ఎప్పుడు పూర్తి చేసారు? నీళ్లు ఎప్పుడిస్తారు? అంటూ ప్రశ్నించారు. ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టును పూర్తి చేయడం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
Narayana Murthy: ఇన్ఫోసిస్ ద్వారా నారాయణ మూర్తి ఫ్యామిలీ ఎంత సంపాదిస్తుందో తెలుసా..?