MLA Seethakka: ఆ భూముల పట్టాలు వెంటనే ఇవ్వండి.. కేటీఆర్‌కు సీతక్క వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka: పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం అందించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. దశాబ్ది వేడుకల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డిగ్రీ కళాశాల సమీపంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మోడల్ బస్టాండ్ కాంప్లెక్స్, సేవాలాల్ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈనేపథ్యంలో.. ములుగు కలెక్టరేట్ వద్ద మంత్రి కేటీఆర్ ను కలిసి ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం సమర్పించారు.
Read also: Shriya Saran : ఆ స్టార్ హీరో తో సినిమాను కావాలనే వదులుకున్న శ్రీయా…?
Also Read
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా రామప్ప నుండి లక్నవరం వరకు కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలని అన్నారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేసి, గిరిజన యూనివర్సిటీ తరగతులు వెంటనే ప్రారంభించాలని వినతి పత్రంలో కోరారు. పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని వినతి పత్రం అందించారు. మూతపడ్డ మంగపేట మండలం కమలాపూర్ లో బిల్ట్ ఫ్యాక్టరీ ని వెంటనే తెరిపించాలని అందరికి ఉపాధి కలుగుతుందని కోరారు. ఏటూరు నాగారం ను రెవెన్యూ డివిజన్ చేయాలని అన్నారు. మంగపేట కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాల, గోవిందరావుపేట మండలం పసర కేంద్రంగా సమ్మక్క సారలమ్మ నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలని పేర్కొ్న్నారు. మల్లంపల్లి, లక్ష్మీదేవిపేట, రాజుపేటలను మండలాలుగా ప్రకటించాలి ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం అందించారు.
Viral news: కొబ్బరిబొండాలను తాగేవారికి హెచ్చరిక.. ఇది మీ కోసమే..
తాజావార్తలు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!