Bandi Sanjay Chitchat: రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం నాకు చేతకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నాకు చేతకాదని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని, కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో అంటూ వ్యాగాస్త్రం వేశారు. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని, పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తామన్నారు. మేము గెలుపు పరంపరం కొనసాగిస్తున్నాం.. వారు ఓటమి పరంపర సాగిస్తున్నారని అన్నారు. డిపాజిట్లు కోల్పోయిన పరంపర సాగుతోందని తెలిపారు. మా దగ్గర సీనియర్లు బాస్ లు.. అదే కాంగ్రెస్ లో హోంగార్డులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీకి ఎందుకు క్యాండిడేట్లు దొరుకుకట్లేదు? అంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం నాకు చేతకాదని ఎద్దేవ చేశారు. బీజేపీ పార్టీ ఎక్కడుందో వాళ్ల అయ్యను కేటీఆర్ అడగాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Beer Sales: రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు.. సమ్మర్ ఎఫెక్ట్‌తో ఊపందుకున్న సేల్స్
బీఆర్ఎస్ ఉందో, బీజేపీ ఉందో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాధానం చెప్పారని అన్నారు. మాది కుటుంబ పార్టీ కాదు.. అయ్య పేరు చెప్పి కూతురు కొడుకు సీఎంలు అయ్యే పార్టీ మాది కాదన్నారు. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ మాది కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. అయ్య లేకుంటే బిడ్డ, బిడ్డ లేకుంటే కొడుకు సీఎం అయ్యే పార్టీ మాది కాదని బండి సంజయ్ అన్నారు. ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు అని, దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కోరారు. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలని అన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. జెండా ఎగురవేయనందుకు కేసీఆర్ కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలని సవాల్ విసిరారు. ఆర్నెళ్లలో మేము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇచ్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామన్నారు. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించామని తెలిపారు. క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే అని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్వహించేలా చేశారని బండి సంజయ్ అన్నారు.
Rahul Gandhi : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం