Puvvada Ajay Kumar: మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జనం బీఆర్‌ఎస్ ను ఇంటికి పంపించటానికి సిద్ధంగా ఉన్నారని, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులకు నిద్ర పట్టడంలేదని పొంగులేటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంత్రి పువ్వాడ స్పందించారు. మాజీ ఎంపీ పొంగులేటిపై మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.