హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌కి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘కృష్ణజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అడ్డుకునే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారు. 66 శాతం కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉండగా 535 టీఎంసీలు రావాల్సి ఉంది. 299 టీఎంసీల వాటాను మాత్రమే తీసుకోవడానికి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పంతాలు,…
నేడు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ సభలో ప్రారంభించారు. అయితే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ.. ఆ తర్వాత హుజురాబాద్ పై దండ ఎత్తుతాం.. కేసీఆర్ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన 30 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తే మేము సహకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అల.. చేస్తే ఎక్కడ సంతకం పెట్టాలి అంటే అక్కడ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని…
తెలంగాణ దళితబంధు పథకానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభ జరగనుంది. ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణానికి దళితులు భారీగా తరలివచ్చారు. లక్షా ఇరవై వేల మందికి సిట్టింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. హుజురాబాద్ నియోజకవర్గములోని ప్రతి గ్రామం నుండి ఐదు…
గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే పంట రుణాల మాఫీ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తోన్న సర్కార్.. ఇవాళ్టి నుంచి 50 వేలలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది. ఇప్పటికే మొదటి విడతలో 25 వేల లోపు రుణం తీసుకున్న 3 లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ చేసింది. ఈసారి ఏకంగా 6 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరనుంది. స్వాంత్రంత్ర వేడుకల్లో దీనిపై మరోసారి ప్రకటన…
రేపు జరుగనున్న ‘దళితబంధు పథకం’ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ వేదిక ముస్తాబైంది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో వేదికను తయారుచేశారు. వేదికపైకి 15 దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలతో పాటుగా పలువురు ఎంపీలు, మంత్రులు కూర్చోనున్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఈ సభ జరుగనుంది. ఇక త్వరలోనే హుజూరాబాద్…
హుజూరాబాద్ లో ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే.. పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సైతం నియోజకవర్గంలో పర్యటించి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఇరువురి మాటల తూటాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న భారీ…
ఇన్ని గంటలపాటు మీటింగ్ కోసం సమయం కేటాయిస్తున్నారు అంటేనే… కాంగ్రెస్ పార్టీ పై మైనార్టీ సోదరులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఒక ముక్క ని కర్ణాటక లో, ఒక ముక్క ని మహారాష్ట్ర లో, మరో ముక్క ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మైనార్టీ సోదరులు మరిచిపోవద్దు. ముస్లిం వ్యక్తి ని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా…
కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో దళిత బంధు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలతో దళితులు ధర్నా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. కాగా, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో దళిత బంధుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమీక్ష నిర్వహించారు. ఈ…
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం రూపొందించినట్లు తెలంగాణ సర్కారు చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకం మూలంగా దళితుల అందరి జీవితాలు బాగుపడతాయని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…