టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ఆమె టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. జనాలు రేవంత్…
తెలంగాణముఖ్యమంత్రి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రకటన కన్నా బాగా ముందే సర్వతోముఖ వ్యూహాలకు పదును పెడుతున్న తీరు ప్రత్యర్థులను తికమకపెట్టే స్థాయిలో నడుస్తోంది.ఒకటి రెండు ఎదురుడెబ్బలు, కరోనా కారణంగా ఒకింత విరామం తీసుకున్న ఆయన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నాటినుంచే జోరు పెంచారు. ఈటెల రాజేందర్ ఉద్వాసన ఆ వెంటనే ఎదురు దాడితో దాన్ని ఉధృతంచేశారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్, ఆయనతో చేరిన ఈటెల రాజేందర్‌లకు తోడు పిసిసి అద్యక్షుడుగా వచ్చిన రేవంత్‌రెడ్డి కూడా…
దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందే అర్హులకు గుర్తింపు కార్డును అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడీ కార్డులో చేర్చి పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తామని వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. లబ్ధి దారుడు తను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి…
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ డబ్బు, అధికారం, పోలీసుల ముందు నేను గెలువలేను. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మీ ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. ఇక్కడికి వచ్చి నేను అంటే నేను…
తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖ, ఇతర ఉన్నత అధికారులు హాజరైయ్యారు. దావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున ప్రజాప్రతినిధులు, అధికార…
మాజీమంత్రి ఈటల రాజేందర్ మరోసారి అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఉపప్రచారంలో భాగంగా నెరెళ్ళ ఊరిలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నెరెళ్ళ ధర్మం తప్పదన్నారు. ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వండి. బీజేపీ పార్టీ జెండాలు పీకెయ్యడంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మేము తలుచుకుంటే వేరే ఉంటాడని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లు ఎటు పోయినారు..? కేసీఆర్ దళితుల మీద ప్రేమ ఒక మోసం.. దళిత సీఎం…
నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నాడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నీళ్లు చేతులారా వదులుతున్నాడు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు.. నిధులు ఎలాగో లేవు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసాడని ఆరోపించాడు. రంగారెడ్డికే కాదు.. పశ్చిమ తెలంగాణకి చుక్క నీరు రానివ్వకుండా చేసాడు. రాష్ట్రానికి దరిద్రం పట్టుకోవడం కాదు…కేసీఆర్ కుటుంబం పట్టుకుందని విమర్శలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో హుజూరాబాద్‌లో కేసీఆర్‌ని ఓడిస్తామని తేల్చి చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల…
“ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (World Youth Skills Day) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతున్నదన్నారు. అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ప్రణాళికలను రచించి అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు. గత పాలనలో అన్నిరంగాల్లో శిథిలమైన మౌలిక వసతులను తీర్చిదిద్దుకుని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవింపచేసుకుంటూ వస్తు న్నామన్నారు. సకల జన జీవనం…