నేడు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ సభలో ప్రారంభించారు. అయితే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ.. ఆ తర్వాత హుజురాబాద్ పై దండ ఎత్తుతాం.. కేసీఆర్ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా ఇవాళ కేసీఆర్‌ది చివరి ప్రసంగం అన్నారు. కేసీఆర్ మాటల్లో పస లేదు.. ప్రజలకు ప్రయోజనం లేదు అని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని రేవంత్ ఆరోపించారు.