కేసీఆర్‌కి తెలంగాణ ప్రజల ఉసురు తగలక మానదు: డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌కి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘కృష్ణజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అడ్డుకునే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారు. 66 శాతం కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉండగా 535 టీఎంసీలు రావాల్సి ఉంది. 299 టీఎంసీల వాటాను మాత్రమే తీసుకోవడానికి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పంతాలు, పట్టింపులకు వెళ్లి జూరాల దగ్గర ప్రాజెక్టుని మార్చారు.
జగన్ తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారు అని డీకే అరుణ ఆరోపించారు. 203 జీవో విడుదల చేసి 6 వేల కోట్లతో ఉత్సాహంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. లోపాయకారి ఒప్పందంతోనే రాయల సీమ ప్రాజెక్టు నడుస్తుంది. అటు ఇటు ఒకే కాంట్రాక్టర్ ఉన్నప్పటికీ ఎందుకు ప్రాజెక్టు పనులు ఆపలేదు. కేఆర్ఎంబీ టేలిమెట్రిస్ ఏర్పాటు చేయాలని సూచించినా ఇప్పటికి ఏర్పాటు చేయలేదు. ఏ ఒప్పందంతో కృష్ణ జలాలను తాకట్టు పెట్టారని కేసీఆర్‌ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కి తెలంగాణ ప్రజల ఉసురు తగలక మానదు. కుర్చీ వేసుకొని కడతానన్న కేసీఆర్ 7 ఏళ్లుగా ఎక్కడున్నారు? 7 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు. కేసీఆర్ జుటా కోర్.. జూరాల దగ్గర రోజు 5 టీఎంసీల నీరు తీసుకునే విధంగా ప్రాజెక్టు కట్టాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉంది’ అని డీకే అరుణ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..