ఇన్ని గంటలపాటు మీటింగ్ కోసం సమయం కేటాయిస్తున్నారు అంటేనే… కాంగ్రెస్ పార్టీ పై మైనార్టీ సోదరులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఒక ముక్క ని కర్ణాటక లో, ఒక ముక్క ని మహారాష్ట్ర లో, మరో ముక్క ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మైనార్టీ సోదరులు మరిచిపోవద్దు. ముస్లిం వ్యక్తి ని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ దే అని తెలిపారు. దేశంలో మోదీని ఎదుర్కునే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. బీజేపీ దృష్టి లో మైనార్టీలు శత్రువులు. ఎక్కడెక్కడ మైనార్టీలు అధికంగా ఉన్నారో… అక్కడే టీఆర్ఎస్ గెలిచింది. మీ ఓట్ బ్యాంక్ తోనే కేసీఆర్ గద్దెనెక్కాడు. కారు స్టీరింగ్ నాచేతిలో ఉంది అని అసద్ అంటాడు… మరి ఎంపీ రంజిత్ రెడ్డి ట్రిపుల్ తలాక్ కి ఎందుకు మద్దతు ఇచ్చాడు. మీరు ఇక్కడ ఎంపీలను గెలిపిస్తారు… కేసీఆర్ వాళ్ళను తీసుకెళ్లి మోడీ చేతిలో పెడుతున్నాడు అని పేర్కొన్నారు.