తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్… పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సిఎం తెలిపారు. read also : ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీ విడుదల జూలై 26…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలవల్ల గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 1700 మంది నర్సులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రోడ్డెక్కిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని ఖండించారు. Read Also: ‘విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్’… కాశ్మీర్…
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన కొత్త పీసీసీ కమిటీకి అభినందనలు తెలిపారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా ఉండకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు. ధీర్ఘకాలం పాటు తనకు పీసీసీ చీఫ్ గా పనిచేసే అవకాశం కల్పించిన సోనియాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని.. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. పోలీసుల వేధింపులను తట్టుకొని నిలబడ్డ కార్యకర్తలకు సెల్యూట్ అని ఆయన చెప్పారు.…
హుజారాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. అక్రమంగా జైల్లో ఉంచినా ఈటలను హుజురాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంచి, నీతివంతమైన, కమీషన్లు లేని, ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఇస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, అవకాశ వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు,…
తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీనే లక్ష్యంగా విమర్శల పదును పెంచారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం లేని నీళ్ల వివాదాన్ని మరోసారి సృష్టించి.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల నుండి నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మార్చి కాచుకొగలడు. నీళ్లతో ఓట్లు కొల్లగొట్టడం కేసీఆర్ కి అలవాటు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా…
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని మాజీ మంత్రి బాబుమోహన్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించిన బాబుమోహన్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. గతంలో ఉన్న సీఎంలు ఎవ్వరు కూడా ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టలేదన్నారు. రైతుబంధు వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఒరుగుతున్నది ఏమీలేదని బాబు మోహన్ ఆరోపించారు. కేసీఆర్ పాలన వలన పేదలకు ఏమి లాభం లేదని,…
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. ఆతర్వాత సిద్దిపేట పట్టణ శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీష్ రావు..…
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ ఇబ్బంది పడుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం సోనియగాంధీ తెలంగాణ ఇచ్చారు అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారు కేసీఆర్. తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయ్యింది. రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి .. తెలంగాణలో సాగు పెరిగింది. కేసీఆర్ కొత్తగా నీళ్ళు ఇచ్చి… సాగు లోకి వచ్చింది లేదు. నాలుగు లక్షల కోట్ల అప్పులు…