ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా ఫస్ట్ రోజే 300 పరుగులు మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది. ట్రెవిస్ హెడ్(146 పరుగులు బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(95 పరుగులు బ్యాటింగ్) టీమిండియా బౌలర్లకు చుక్కులు చూపించారు.
Also Read : Balasore train crash: రైలు ప్రమాదం.. నష్టపరిహారం కోసం బతికున్న భర్తను చంపేసిన మహా ఇల్లాలు
అయితే ఈ ఇద్దరు ఆసీస్ బ్యాటర్లు ఇప్పటికే నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 251 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. తొలి సెషన్‌లో రెండు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు.. మలి రెండో సెషన్లు కలిపి కేవలం ఒకే ఒక్క వికెట్ తీసుకున్నారు. ఇక రోజంతా కలిపి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసిన భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.
Also Read : Tejeswi Madivada: ఎద అందాలు,థండర్ థైస్‌తో రచ్చ చేస్తున్న తేజస్వి మదివాడ..
ఆస్ట్రేలియాకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన మంచి ఆరంభాన్ని ట్రెవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కొనసాగించారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఈ ఇద్దరు పరుగులు రాబట్టడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా ట్రెవిస్ హెడ్ వన్డే తరహా బ్యాటింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రోజు ముగిసే సరికి 150 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే రెండోరోజు ఆటలో హెడ్ డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read : Jharkhand: గుడిలో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిన ప్రేమజంట..
అటు తన మార్క్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్న స్టీవ్ స్మిత్ 95 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కే పనిలో ఉన్నాడు. రెండో రోజు ఆటలో స్మిత్ శతకం కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.