భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లోనూ నాలుగు టైటిల్స్ గెలిచిన ధోనీ, ఈ ఏడాదితో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. టీమ్‌లో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్లు ఉన్నా కేవలం మూడేళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ కెప్టెన్సీ అప్పగించింది. దీనికి కారణం ఏంటో తెలుసా.. ధోనీ కెప్టెన్సీలో ఆడడం ఎప్పుడూ చాలా మజాగా ఉంటుంది. ఎందుకంటే అతను టీమ్‌ని నడిపించే విధానం అలా ఉంటుంది అని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. కెప్టెన్‌గా అతని రికార్డులు చాలు, మాహీ ఏం చేయగలడో చెప్పడానికి అని ఆయన అన్నారు.
Also Read : Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో టెర్రరిస్టులు.. ఆరుగురి అరెస్ట్..
మాహీ కూల్‌నెస్ మాత్రమే కాదు, అతను గేమ్‌ని అర్థం చేసుకునే విధానం అద్భుతంగా ఉంటుంది అని రవిశాస్త్రి అన్నాడు. 2007లో నేను టీమిండియా మేనేజర్‌గా ఉన్నాను.. ఆ సమయంలో దిలీప్ వెంగ్‌సర్కార్ చీఫ్ సెలక్టర్.. ఈడెన్ గార్డెన్స్‌లో రాహుల్ ద్రావిడ్ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు. ద్రావిడ్ ఆడలేకపోవడంతో కొత్త కెప్టెన్ కోసం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ద్రావిడ్ వయసుని కూడా దృష్టిలో పెట్టుకుని, టీమిండియాకి ఫ్యూచర్ కెప్టెన్‌ని వెతకాల్సిన సమయం వచ్చేసిందని అనుకున్నాం.. అప్పుడు నాకు ధోనీ పేరే గుర్తుకు వచ్చింది. ఈ కుర్రాడిలో లీడర్‌షిప్ క్వాలిటీలు పుషల్కంగా ఉన్నాయి.. అని వెంగ్‌సర్కార్‌తో చెప్పాను అని రవిశాస్త్రి వెల్లడించారు. దిలీప్ కూడా అదే నమ్మాడు.. దీంతో ఎక్కువ సమయం దాని గురించి తాము చర్చించలేదు.
Also Read : Road accident: బ్యాచిలర్ పార్టీకి వెళుతూ ఘోరం.. ముగ్గురు మృతి.. 9 మందికి గాయాలు
దిలీప్ ఐడియల్ సెలక్టర్.. ధోనీ కూల్‌నెస్ మాత్రమే కాదు, అతను గేమ్‌ని అర్థం చేసుకునే విధానాన్ని కూడా దిలీప్ వెంగ్‌సర్కార్ గమనించాడు. అతని వ్యక్తిత్వం, పర్సనాలిటీ, సీనియర్లతో వ్యవహరించే విధానం… ఇలా అన్నీ చూసి ధోనీని టీమిండియా కెప్టెన్‌గా ఎంచుకున్నాం.. మాహీ టీమ్‌కి మంచి కెప్టెన్ అవుతాడని అనుకున్నాం. అయితే అతను గొప్ప సారథిగా రికార్డులు క్రియేట్ చేశాడు అని ఈ మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మాహీకి ఇప్పుడున్న క్రేజ్‌కి అతని సక్సెసే కారణం.. అంటూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు.