వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు భారత జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాపడుతున్నారు. పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, కీపర్ రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ లు జట్టుకు ఎంపిక చేయకముందే గాయాల కారణంగా దూరం అయ్యారు. అయితే జట్టును ప్రకటించిన తర్వాత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో గాయపడి దూరం కాగా.. అతని స్థానంలో యువ ప్లేయర్ ఇసాన్ కిషన్ కు ఛాన్స్ వచ్చింది.
Also Read : IPL 2023 : దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ స్కోర్..
మరో వైపు శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ లు గాయాల నుంచి కోలుకున్నారా.. కోలుకుంటే పిట్ నెస్ సాధించారా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. ఈ షాక్ ల నుంచి ఇంకా కోలుకోకముందే టీమ్ ఇండియాకు మరో గట్టి దెబ్బ తగిలింది. తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Supreme Court: పాత విద్యుత్ బిల్లును కొత్త యజమానుల నుంచి వసూలు చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఐపీఎల్ లో అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను ఆడలేదు. టాస్ సందర్భంగా రాజస్థాన్ సారథి సంజు శాంసన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అందుకనే చివరి నిమిషంలో జట్టులో మార్పులు చేయాల్సి వచ్చిందని శాంసన్ పేర్కొన్నాడు. ఈ విసయం తెలిసిన అశ్విన్ ఫ్యాన్స్ అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read : AP BJP: ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించిన సోము వీర్రాజు
ఇక.. అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు.. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే కనీసం రెండో ప్రయత్నంలో అయినా ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలవాలని భావిస్తున్న భారత జట్టుకు ఇది నిజంగానే గట్టి ఎదురుదెబ్బ అనోచ్చు. లండన్ లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి 12 వరకు భారత్-ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.