భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురింపించాడు. ఈ కీలక మ్యాచ్ లో ద్రివిడ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ప్రస్తుతం 296 పరుగుల తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
భారత క్రికెట్ జట్టు ఆటగాడు, కర్నాటక ఫేసర్ ప్రసిధ్ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. తన చిరకాల స్నేహితురాలు రచనా కృష్ణను వివాహమాడారు. మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరగగా.. బుధవారం సంప్రదాయ పంథాలో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా ఫస్ట్ రోజే 300 పరుగులు మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది.
ఈ సిరీస్లో భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అదే విధంగా హార్దిక్ డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని యువ క్రికెటర్లను తయారు చేసి పనిలో బీసీసీఐ పడినట్లు తెలుస్తోంది.
మరో వారం రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. అఫిషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరిస్తుంది.
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా జూన్ 7 నుంచి 11 వరకూ ఇంగ్లాండ్లో ని ‘ది ఓవల్’ స్టేడియం వేదికగా జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది.
ఫ్ఘానిస్తాన్ తో ఆడేందుకు భారత జూనియర్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో భారత కెప్టెన్సీ పగ్గాలు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి.