BCCI Changed Twitter Display Picture to Indian Flag For Independence Day 2023 Campaign: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తన ట్విటర్ ఖాతా డీపీ (డిస్‌ప్లే పిక్చర్)ని మార్చింది. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా బీసీసీఐ.. భారత జెండాను డీపీగా పెట్టుకుంది. దాంతో ట్విటర్ అధికారిక గుర్తింపు అయిన ‘గోల్డెన్ టిక్’ను బీసీసీఐ కోల్పోయింది. ఆదివారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ ప్రారంభానికి కొద్ది క్షణాల ముందు బీసీసీఐ తన ఎక్స్ ఖాతా డీపీని మార్చింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా డీపీని మార్చుకోవాలని ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
మంగళవారం (ఆగస్టు 15) నాడు భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో డీపీగా భారతీయ త్రివర్ణ పతాకాన్ని పెట్టుకుని ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో చేరాలని భారత ప్రజలను ప్రధాని మోడీ ఆదివారం ఉదయం కోరారు. ప్రధాని మోదీ స్వయంగా భారత జెండాను డీపీగా పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి బీసీసీఐ కూడా తమ ఎక్స్ డీపీని చేంజ్ చేసింది.
Also Read: Kajal Aggarwal Pics: శారీలో చందమామ.. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ వైరల్!
ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయకముందు బీసీసీఐకి బ్లూ టిక్ ఉండేది. మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశాక చాలా మార్పులు చేశారు. అధికారిక, సర్టిఫైడ్ కంపెనీలకు ఇప్పుడు ‘గోల్డెన్ టిక్’ ఇస్తున్నారు. బీసీసీఐ కూడా గోల్డెన్ టిక్ సంపాదించిది. అయితే ఇప్పుడు డీపీ మార్చడంతో.. గోల్డెన్ టిక్ కనిపించకుండా పోయింది. కొత్త నిబంధనల ప్రకారం.. బీసీసీఐ ఖాతాను మరోసారి వెరిఫై చేసిన తర్వాత గోల్డెన్ టిక్ వస్తుంది.